Lover Suicide: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలు.. చచ్చిపోమని పురుగుల మందు కొనిచ్చిన ప్రియుడు.. చివరకు?
- ఒకమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు
- మోసపోయానని గ్రహించి నిలదీసిన ప్రియురాలు
- పురుగుల మందు తాగి చచ్చిపో అంటూ డబ్బులు పంపిన ప్రియుడు
- పురుగుల మందు తాగి ప్రియురాలు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Suicide: ప్రేమించానని మాయ మాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా శ్వాస, నువ్వే నా జీవితం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి దాదాపు ఏడేళ్లు ఆ అమ్మాయితో కలిసి తిరిగాడు. చివరకు పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడగగానే ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ, లైఫ్ ఎంజాయ్ చేద్దామంటూ దాట వేసుకుంటూ వచ్చాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటి అని ప్రేమించిన అమ్మాయి గట్టిగా నిలదీస్తే.. అసలు రూపాన్ని బయటపెట్టాడు ఆ ప్రియుడు. అక్కడితో ఆగకుండా చావమని పురుగుల మందు కొనిచ్చాడు. అందుకోసం ఆన్లైన్లో డబ్బు కూడా చెల్లించాడు. చివరకు ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు సిద్ధపడింది.
Read Also: Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు
Also Read
అసలేం జరిగిందంటే.. కాకినాడలో ఏడేళ్లు ప్రేమించిన యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు ఉమామహేశ్వరరావు అనే యువకుడు.. యామిని అనే యువతిని ప్రేమించాడు యువకుడు. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది.. తర్వాత ఉమామహేశ్వరరావుకు మరొక అమ్మాయితో నిశ్చితార్థం అయింది.. మన సంగతి ఏంటని యామిని ప్రశ్నించింది.. నువ్వు లేకపోతే చనిపోతానని ఉమామహేశ్వరరావు చెప్పింది.. ఫెర్టిలైజర్స్ దుకాణానికి వెళ్లి పురుగుల మందు కొనుక్కుంటానని స్కానర్ పంపించింది.. దానికి ఏమీ అడ్డు చెప్పని ఉమామహేశ్వరరావు పురుగులు మందుకి 275 ఫోన్ పే చేశాడు.. దాంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది యామిని.. ప్రియుడు దక్కకపోవడం, పురుగుల మందు తాగమనడంతో యామిని ఆత్మహత్య చేసుకుంది. వాట్సాప్‌లో మెసేజ్‌లు చూసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఉమామహేశ్వరరావు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!