NTV Telugu Site icon

Kid Assaults: అమానుషం.. తన కుక్కను అనుకరించినందుకు 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)

Dog

Dog

Kid Assaults: పంజాబ్‌ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి తన కుక్కను అనుకరిస్తున్నాడన్న ఆరోపణతో ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఆందోళన కలిగించే దృశ్యాలు వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. 5 ఏళ్ల బాలుడు ట్యూషన్ క్లాస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కుక్క మొరుగడాన్ని అనుకరిస్తూ కనిపించాడు. ఈ చర్య కుక్క యజమానికి కోపం తెప్పించింది. దాంతో ఆగ్రహించిన కుక్క యజమాని బాలుడిపై దాడికి పాలపడ్డాడు.

Family Murder: ప్రేమికుడి కోసం 13 మంది కుంటుంబసభ్యుల ప్రాణాలను బలికొన్న అమ్మాయి

స్కూల్ బ్యాగ్‌తో ఉన్న చిన్నారిపై ఆ వ్యక్తి దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా అర్థమవుతుంది. అతను కనికరం లేకుండా దాదాపు నిమిషం పాటు బాలుడిని కొట్టాడు. అతనిని నేలమీద పడవేసి అతని ఛాతీపై కాలుతో అదిమి పట్టాడు. దాడి తర్వాత ఆ చిన్నారి స్కూల్ డ్రెస్ లో ఉన్న మరో అమ్మాయితో కలిసి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక పొలిసు అధికారులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.

Paruchuri Venkateswara Rao : ప్రేక్షకులు మెచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ

Show comments