Site icon NTV Telugu

Gold Smuggling: ఏం ఐడియా రా బాబు.. చీరకు గోల్డ్ స్ప్రే చేసి స్మగ్లింగ్‌

Gold

Gold

Gold Smuggling: ఎర్రచందనం, జంతువుల చర్మాలు, డ్రగ్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే దొంగ రవాణాలో దేశం దాటుతున్న, దేశంలోకి వస్తున్న వస్తువులు ఎన్నో, వాటి కోవలోకే వస్తుంది బంగారం కూడా, దొంగరవాణాని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. మనసుంటే మార్గాలు ఎన్నో ఈ సూక్తిని ఎవరు పాటించిన లేకున్నా స్మగ్లర్లు మాత్రం తూచా తప్పకుండ పాటిస్తున్నారు, అందుకు శంషాబాద్ విమానాశ్రయం సంఘటనే ఉదాహరణ.

Read Also: Kushi Trailer: విజయ్, సమంత ‘ఖుషి’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. సెన్సార్ కూడా పూర్తి!

శుక్రవారం దుబాయి నుండి వచ్చిన ఒక ప్రయాణికుని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారం విలువ 28.01 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు లెక్కకట్టారు. అధికారులకి దొరకకుండా ఉండేందుకు స్మగ్లర్ చీరకి బంగారు స్ప్రే చేసానని చెప్పగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయడంతో స్మగ్లర్ దొరికాడని అతన్ని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నాం అని కస్టమ్స్ అధికారులు తెలియచేసారు. ఇలాంటి సంఘటనలు దేశంలో పలుచోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం రవాణాకు స్మగ్లర్ ఎన్నుకునే మార్గాలలో విమానాశ్రయం మొదటి స్టానంలో ఉంటుంది. కానీ, ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్న, చేసేది తప్పని పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసిన స్మగ్లర్లు మాత్రం వాళ్ళ తీరుని మార్చుకోవడం లేదు.

Exit mobile version