Site icon NTV Telugu

Bengaluru: దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని యువకుడి దారుణ హత్య

Bengaluru

Bengaluru

Man Beaten To Death For Chatting With Girl: బెంగళూర్ లో దారుణం జరిగింది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. మృతుడిని గోవిందరాజుగా గుర్తించినట్లు, హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితులు అనిల్‌, లోహిత్‌, భరత్‌, కిషోర్‌గా గుర్తించారు. ప్రధాన నిందితుడు అనిల్ ఆదివారం ఉదయం గోవిందరాజును ఇంటి నుంచి బయటకు పిలిచి బైక్ పై ఆండ్రల్లికి తీసుకెళ్లినట్లుగా అధికారులు తెలిపారు.

Read Also: Byjus Layoff: మరోసారి.. బైజూస్ లో లేఆఫ్.. ఎన్ని ఉద్యోగాలంటే..?

ఇలా తీసుకెళ్లిన తర్వాత గోవిందరాజును అనిల్ తో కలిసి మరో ముగ్గురు నిందితులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోవిందరాజు అక్కడికక్కడే మరణించాడు. ఘటన తర్వాత నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాప్ చేశారు. మృతదేహాన్ని కారులో ఉంచి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక రోజు సదరు యువతి సెల్ ఫోన్ ఇంటిలో మరిచిపోవడంతో కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ ని పరిశీలించగా.. గోవిందరాజుతో చేసిన చాటింగ్, వీడియోలను చూశారు. ఆ తరువాత గోవిందరాజు హత్య జరిగింది.

Exit mobile version