Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!

Mammootty Vs Dulquer Salmaan

Mammootty Vs Dulquer Salmaan

Mammootty vs Dulquer Salmaan: సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఆసక్తికరమైన పోటీలు చూస్తుంటాం. కానీ, ఎప్పుడు జరగని విడ్డురం ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో క్లాష్ జరగబోతోంది. కాకపోతే అదికూడా సొంత భాషలో కాకుండా.. వేర్వేరు భాషల చిత్రాలతో తండ్రీకొడుకులు ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ మరో వారంలో ఈ విచిత్రమైన బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్ధమవుతున్నారు.

తెలుగు సినిమాతో దుల్కర్ సల్మాన్

మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

తమిళ చిత్రంతో మమ్ముట్టి ఎంట్రీ

మరోవైపు, దుల్కర్ తండ్రి లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓం’ (O.M) కూడా సరిగ్గా నవంబర్ 20నే విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో మమ్ముట్టి ఒక అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.

హాట్ టాపిక్‌గా మారిన పోరు

మలయాళ హీరోలైన తండ్రీకొడుకులు ఇద్దరూ పక్క ఇండస్ట్రీల సినిమాలతో ఒకే రోజు పోటీ పడుతుండటం సినీ అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో వస్తుంటే.. మరోవైపు మమ్ముట్టి స్ట్రెయిట్ తమిళ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి నవంబర్ 20న జరగబోయే ఈ విచిత్రమైన బాక్సాఫీస్ పోరులో కొడుకు తెలుగులో హిట్ కొడతాడా..? లేక తండ్రి తమిళంలో సత్తా చాటుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.