Abraham Ozler : ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మమ్ముట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి ఈ నెలలోనే రాబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఓ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా అబ్రహం ఓజ్లర్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రే అయినా కూడా ఆయన ఓ సీరియల్ కిల్లర్ గా నటించడం విశేషం.. జయరాం ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు.మలయాళ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మూవీ మార్చి 20 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని శుక్రవారం (మార్చి 1) హాట్‌స్టారే అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా కేవలం మలయాళంలోనే వస్తుందా లేక మిగతా భాషల్లోనూ అందుబాటులో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు.
మిధున్ మాన్యుయెల్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జయరాం కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 25న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజైంది.ఈ సినిమా కథ విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ (జయరాం) భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు. వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు..?అలెక్స్ (మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి…? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
Also Read
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!