ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా ప్రేమలు.. తెలుగులో కూడా డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. హీరోయిన్ మమితాబైజు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన క్యూట్ నెస్ తో యూత్ మనసు దోచుకుంది..
ఈ అమ్మడుకు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.. ప్రేమలు తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మమితా బైజుకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తాజాగా ఈ అమ్మడు రెబల్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన సినిమాలో మమితాబైజు హీరోయిన్ గా నటించింది.. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది..
అయితే కేవలం 10 రోజుల గ్యాప్ లోనే ఓటీటీలోకి వచ్చేసింది..అయితే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రెబెల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజై కనీసం రెండు వారాలు కూడా కాకముందే ఓటీటీలోకి రావడం నెట్టింట పెద్ద చర్చగా మారింది.. ఈ సినిమాకు నికేష్ ఆర్ ఎస్ దర్శకత్వం వహించారు. కేరళలోని మున్నార్‌కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించారు.. కానీ జనాలకు అది నచ్చకపోవడంతో సినిమాను కొద్దిరోజులకు తీసేసారు.. మరి ఓటీటీలో ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..