NTV Telugu Site icon

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చాలని కేంద్రానికి వినతి

Mamatha

Mamatha

West Bengal CM: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా మార్చారు.. ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే తప్పులేదు కానీ, బెంగాల్ ను బంగ్లా గా మారిస్తే తప్పేముంది? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం.. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చాం.. కానీ చాలా కాలంగా పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చలేదన్నారు.

Read Also: Merry Christmas: అన్నిసార్లు వాయిదా పడినా హిట్ కొట్టారు…

పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా పేరును మార్చడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను సీఎం మమతా బెనర్జీ ఎత్తి చూపించారు. మన రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చినట్లయితే.. వివిధ పోటీలలో పాల్గొనే, చదువుకునేందుకు వెళ్ళే మన పిల్లలకు ప్రాధాన్యత లభిస్తుంది అన్నారు. రాష్ట్రం పేరుతో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. దీనికి ఉదాహరణగా పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది.. అదే పేరుతో భారతదేశంలో రాష్ట్రం ఉందని చెప్పారు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం పేరును ‘పశ్చిమ్ బంగా’ లేదా ‘వెస్ట్ బాంగో’గా మార్చాలని డిమాండ్ చేసింది. ఐదు సంవత్సరాల తరువాత, మమతా బెనర్జీ ప్రభుత్వం “బొంగో” అనే కొత్త పేరును ప్రతిపాదిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.