Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
- కోల్‌కతా వీధుల్లో మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
- బీజేపీ ఒక దోపిడీ పార్టీ అంటూ విమర్శలు
- 3.8 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
READ ALSO: DMF Awards : గ్రాండ్ గా భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
మమతా బెనర్జీ ఏం అన్నారంటే..
ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ “చాలా మంది అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను తొలగిస్తారా అని ఆలోచిస్తున్నారు. బంగ్లాలో మాట్లాడటం అంటే బంగ్లాదేశీ అని కాదు, హిందీ లేదా పంజాబీలో మాట్లాడటం అంటే పాకిస్థానీ అని అర్థం కాదు. బంగ్లాలో మాట్లాడే వారిని బంగ్లాదేశీ అని ముద్ర వేస్తున్నారు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని ఈ మూర్ఖులు. ఆ సమయంలో బీజేపీ ఎక్కడ ఉంది? అందుకే స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒకే భూమిలో భాగమని వారికి తెలియదు ” అని వెల్లడించారు. “బీజేపీ ఒక దోపిడీ పార్టీ. వారు అనేక ఏజెన్సీలను ఉపయోగించుకున్నారు, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ భవిష్యత్తులో వాళ్లు అధికారంలో ఉండరు” అని అన్నారు.
మమతా బెనర్జీ తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి నగరం నడిబొడ్డున వేలాది మంది మద్దతుదారులతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన ర్యాలీని రెడ్ రోడ్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించి 3.8 కిలోమీటర్ల మేర నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ, SIR వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ చుట్టూ ఉన్న భయం ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొందని అన్నారు. “గత ఏడు రోజుల్లో SIR భయం కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు నేటి ర్యాలీలో మాతో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు వ్యక్తులు తమ ఓటు హక్కులు హరించబడతాయని భయపడ్డారు” అని ఆయన చెప్పారు.
READ ALSO: Bilaspur Train Accident: భయంకరమైన రైలు ప్రమాదం .. ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?