NTV Telugu Site icon

Mallu Ravi: ఢిల్లీ పదవికి మల్లు రవి గుడ్‌బై.. ఎంపీ టికెట్‌పై హాట్ కామెంట్స్

Ravi Reging

Ravi Reging

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్చర్లలో మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు మల్లు రవి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు. ఆమోదిస్తారా? లేదా ? అనేది ఆయన నిర్ణయానికి వదిలేస్తానన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆ పదవి అడ్డంకిగా ఉంటుందని అభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు.

నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం కోసమే జడ్చర్ల అసెంబ్లీ టికెట్ వదులుకున్నట్లు తెలిపారు. ఏ సర్వేలు చేసినా నాగర్ కర్నూల్ ఎంపీగా తానే గెలుస్తానని చెబుతున్నాయని చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు ఇయ్యని పక్షంలో టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఉండవద్దు.. అందుకే తన పదవికి రాజీనామా చేశానన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయిరెడ్డి ఎంపీగా.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారని మల్లు రవి గుర్తుచేశారు.

ఇటీవల కోస్గిలో జరిగిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరు ప్రకటించారు. ఈ ప్రకనట తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి చెలరేగింది. తాజాగా నాగర్ కర్నూలు టికెట్ కోసం మల్లు రవి ఢిల్లీ పదవికి రాజీనామా చేశారు. మరీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇకపోతే ఖమ్మం.. తదితర నియోజకవర్గాల్లో మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం సతీమణి నందిని.. మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోదరుడు పోటీ పడుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.