Site icon NTV Telugu

Mallikarjun Kharge: సోనియా, రాహుల్ సమక్షంలో రేపు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే

Mallikarjuna Kharge

Mallikarjuna Kharge

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికైన విషయం విధితమే. ప్రత్యర్థి అభ్యర్థి శశిథరూర్‌పై 84శాతం ఓట్ల తేడాతో ఖర్గే విజయం సాధించారు. కాగా, బుధవారం పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా హాజరుకానున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు 80ఏళ్ల ఖర్గే పార్టీ పగ్గాలు అందుకోనున్నారు. మధుసూదన్ మిస్త్రీ అధ్యక్ష ఎన్నిక సర్టిఫికేట్‌ను ఖర్గేకు అందజేయనున్నారు.

Read Also: Indonesia: ఇండోనేషియాలో ఘోరం.. పడవ ప్రమాదంలో 14మంది మృతి

మల్లికార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ల నాయకులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, వివిధ విభాగాల ఇంచార్జ్ లు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మంత్రులు, అన్నిరాష్ట్రాల్లోని మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ సీఎల్‌పీ నాయకులు పాల్గొననున్నారు.

Read Also: Dhoni: కొత్త కథతో ఎంఎస్ ధోనీ సినిమా.. రిలీజ్ అప్పుడే..?

24ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేరుతున్నాయి. 53ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న ఖర్గే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో రేపు పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి పదవికి చేరుకున్నారు. లోక్ సభ, రాజ్యసభా పక్ష నేతగానూ పనిచేశారు. పదేళ్లుగా కేంద్ర మంత్రిగా, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా ఖర్గే పనిచేశారు.

Exit mobile version