NTV Telugu Site icon

Mallikarjun Kharge: ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే గెలుపు.. బీజేపీకి అంత సీన్ లేదు..

Karge

Karge

వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అధికార వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు తమ పనిని సక్రమంగా చేస్తున్నాయి.. అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని ఖర్గే తెలిపారు. అయితే, నవంబర్ 7న మిజోరం, నవంబర్ 7, 17న ఛత్తీస్‌గఢ్, నవంబర్ 17న మధ్యప్రదేశ్, 25న రాజస్థాన్, 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Read Also: TS BJP: జగిత్యాలలో భోగ శ్రావణికి సహకరించేది లేదన్న ముదుగంటి..

అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో తాము గెలుస్తాం.. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి అంశాలు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఖర్గే తెలిపారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ చీఫ్ ఆరోపణలు చేశారు.

Read Also: Shraddha Kapoor : మరో లగ్జరీ కారును కొన్న శ్రద్దా కపూర్..ఎన్ని కోట్లో తెలుసా?

ఇక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో అన్ని ప్రధాన రాజ‌కీయ పార్టీలు త‌మ అగ్రనాయకులను ఎన్నికల ప్రచారంలోకి దించాయి.