Sunitha Mahendhar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయంలో తెరవెనుక లోపాయకారి ఒప్పందం చేసుకొని ప్రజలను వంచిస్తున్నాయని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్‌పల్లి 121 డివిజన్‌లో భారీ రోడ్ షో నిర్వహించి.. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసి బీజేపీ అభ్యర్థి ఈటెల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో బయటకు తిట్టుకుంటూ లోపల మాత్రం కలిసి ఉంటారని అన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: CM Revanth Reddy: మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడుని అభినంధించిన సీఎం..
తనను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీలతో పాటు ఇండియా కూటమితో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం నుంచి పాంచ్ న్యాయ్ పథకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి మల్కాజిగిరిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని కోరారు. అంతకు ముందు రెయిన్ బో విష్టాలో ఓటర్లతో బ్రేక్ ఫాస్ట్ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ , వినయ్ రెడ్డి, గొట్టిముక్కుల దేశాలు, భీమ్‌రావు, తూము వేణు, నాగిరెడ్డి, గొట్టిముక్కుల వెంకట్, మేకల రమేష్, సత్యం శ్రీరంగం, గోవింద్ గౌడ్, వినయ్ రెడ్డి, శేరి సతీష్ రెడ్డి, కృష్ణవేణి వెంకటరావు, పుష్ప రెడ్డి, మైఖేల్, కృష్ణంరాజు, అరవింద్ రెడ్డి, మోయిజ్, రఘు, అక్బర్ లక్ష్మణ్, భాష, నాగిరెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.