NTV Telugu Site icon

Sunitha Mahender Reddy: పండుగలతోనే ప్రజల మధ్య ఐక్యమత్యం: సునీత మహేందర్ రెడ్డి

Sunitha Mahender Reddy

Sunitha Mahender Reddy

Malkajgiri MP Candidate Patnam Sunitha Says Festivals bring unity among people: మంగళవారం (ఏప్రిల్ 23) దేశవ్యాప్తంగా ‘హనుమాన్‌ జయంతి’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి నగరంలో హనుమాన్ శోభాయాత్రలు భారీ ఎత్తున సాగాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రముఖులు భాగమయ్యారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారం చైతన్యపురి డివిజన్‌లో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పట్నం సునిత మహేంధర్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కారక్రమంలో సునీత పాల్గొన్నారు. భక్తులకు ఆమె స్వయంగా వడ్డించారు.

పండుగలతోనే ప్రజల మధ్య ఐక్యమత్యం పెరుగుతుందని సునిత మహేంధర్ రెడ్డి అన్నారు. ‘శ్రీరాముడు, హనుమంతుడు హిందువులందరికి దేవుడు. పండుగలతోనే ప్రజలు, మతాల మధ్య స్నేహాభావం, ఐక్యమత్యం పెంపొందుతాయి’ అని సునిత అన్నారు. హనుమాన్ జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, పారిజాత లక్ష్మరెడ్డి, ఆపన్న హస్తం ఫౌండేషన్ అధ్యక్షులు చీకోటి సాయి నిఖిత సంపత్, శివరాం గుప్తా, లక్ష్మీ ప్రసన్న, సుజాత, ఆకుల రమాకాంత్, ఉప్పల శివరామకృష్ణ, శాలిని, శ్యామ్ చరణ్ రెడ్డి, రంజిత్, కరుణశ్రీ సహా హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

Also Read: Shivam Dube: ఏం ఆడుతున్నాడు.. శివమ్‌ దూబేకు టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా!

మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునీత రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పట్నం సునీత పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె ప్రచారంతో బిజీగా ఉన్నారు.

Show comments