NTV Telugu Site icon

Health: ఆడవారికంటే మగవారికే ఎక్కువ.. ఏంటో తెలుసా..?

Untitled 7

Untitled 7

Health: పురాణకాలం నుండి ప్రస్తుత కాలం వరకు ఉన్న ప్రశ్న. సమాధానం ఉన్న ఆ సమాధానాన్ని సమర్ధించని ప్రశ్న ఎవరు ఎక్కువ..? పురుషులా? స్త్రీలా..? ఎవరు ఎక్కువ.. ? ఈ ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. అయితే పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ అనే విషయం పక్కన పెడితే. ఇది మాత్రం పురుషుల్లోనే ఎక్కువ. అదేంటి అనుకుంటున్నారా..? అదే హార్ట్ అటాక్ . కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో కంటే పురుషుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువ. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:BR Ambedkar Statue: అమెరికాలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం.. అక్టోబర్ 14న ఆవిష్కరణ!

హార్మోన్లు కూడా హృదయం పని తీరు పైన ప్రభావితం చూపిస్తాయి. సాధారణంగా మహిళల్లో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ అనే ప్రత్యుత్పత్తి హార్మోన్లు అధికంగా ఉంటాయి. ఇవి హృదయాన్ని పదిలంగా ఉండేలా చేస్తాయి. కాగా పురుషుల్లో ఈ హార్మోన్ల శాతం చాల తక్కువగా ఉంటుంది. అయితే వీరిలో టెస్టోస్టిరోన్ అనే ప్రత్యుత్పత్తి హార్మోన్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పాత్ర వహిస్తుంది. అయితే 40 ఏళ్ల తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుందని దీని వళ్ళ గుండెపోటువచ్చే అవకాశం ఎక్కువ ఉందని కొన్ని అధ్యయనాలుపేర్కొంటున్నాయి. గుండెపోటుకి మరో ముఖ్య కారణం కొలెస్ట్రాల్. సాధారణంగా గుండె మరియు రక్తనాళాల పరిమాణం స్త్రీలల్లో కంటే పురుషుల్లో పెద్దగా ఉంటుంది. అలానే పురుషుల్లో కొలెస్ట్రాల్ ప్రధాన ధమనులలో పేరుకుపోయి ఫలకాలు ఏర్పడతాయి.

Read also:NTR: ఆ సూపర్ స్టార్స్ ‘అవెంజర్స్’ అయితే ఎన్టీఆర్ ‘థానోస్’ లాంటి విలన్…

కాగా స్త్రీలల్లో చాలావరకు చిన్న చిన్న రక్తనాళాల్లో కనిపిస్తుంది. ఇదికూడా పురుషుల్లో గుండెపోటు రేటు అధికంగా ఉండడానికి కారణం. ఇక మరో కారణం మహిళలు ఎలాంటి వార్తనైనా తట్టుకోగలరు. ఎందుకంటే మహిళలు చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తారు. దీని వల్ల ఎలాంటి షాకింగ్ వార్తలు విన్న ఉద్రేకానికి గురైన మొదటగా ఏడుస్తారు కనుక మహిళకు ఒత్తిడి తగ్గుతుంది. కానీ పురుషులు ఎక్కువగా ఏడవరు కనుక ఉద్రేకానికి గురైనప్పుడు, షాకింగ్ వార్తలు విన్నప్పుడు ఒత్తిడి ఎక్కువై రక్తప్రసరణ రేటు పెరుగుతుంది. దీని వల్ల గుండెపోటు వస్తుంది

Show comments