Site icon NTV Telugu

Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?

Maldivis

Maldivis

Maldives- India Tension: చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్‌ను సందర్శించనున్నారు. జమీర్ పర్యటన షెడ్యూల్ ను మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత ఊపందుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ద్వీప దేశంలో మూడు సైనిక స్థావరాలను నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ పట్టుబట్టడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. భారత్ ఇప్పటికే చాలా మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ప్రెసిడెంట్ ముయిజ్జూ తన దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవడానికి మే 10ని గడువుగా నిర్ణయించారు.

Read Also: Kajal Agarwal : మరోసారి బాలయ్య సినిమాలో కాజల్..?

ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు (మే 9) అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం నాడు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో జమీర్ భేటీ అవుతారని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశంగా ఉంది.

Read Also: PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ

అలాగే, విదేశాంగ మంత్రి జమీర్ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊపందుకుంటుంది అని MEA ఒక ప్రకటనలో పేర్కొంది. మాల్దీవులు-భారత్ భాగస్వామ్యాన్ని “దీర్ఘకాలిక” సంబంధాలను విస్తరించడంపై దృష్టి సారించి జైశంకర్‌తో జమీర్ చర్చలు జరుపుతారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమీర్‌ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Exit mobile version