NTV Telugu Site icon

India-Maldives: భారత్ లో మాల్దీవుల మంత్రి రోడ్ షో..వారిని ఆకర్శించేందుకు యత్నం

Maldives

Maldives

భారతదేశం-మాల్దీవుల మధ్య సంబంధాలలో హెచ్చు తగ్గుల నేపథ్యంలో.. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ నేటి నుంచి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ సమయంలో.. అతను భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి, మాల్దీవుల ప్రభుత్వం వెల్‌కమ్ ఇండియా ప్రచారానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. దీని కింద భారతీయ పర్యాటకులు మాల్దీవులను పెద్ద సంఖ్యలో సందర్శించాలని విజ్ఞప్తి చేస్తుంది. మాల్దీవుల పర్యాటక మంత్రి భారతదేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరులు ఉన్నాయి. న్యూఢిల్లీ 30 జులై 2024, ముంబై 1 ఆగస్టు 2024, బెంగళూరు 3 ఆగస్టు 2024 న రోడ్ షో కొనసాగనుంది.

READ MORE: Vizag Drugs Case: మళ్లీ తెరపైకి వైజాగ్‌.. ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ రాకెట్..

భారతీయ పర్యాటకులకు మాల్దీవులు చాలా ఇష్టమైన ప్రదేశం. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత మాల్దీవులను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది. పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 42,638 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. కాగా.. గతేడాది ఇదే నాలుగు నెలల్లో 73,785 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులకు చేరుకున్నారు. ఈ ప్రచారం లక్ష్యం భారతదేశం,మాల్దీవుల మధ్య పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేయడం. ఈ ఏడాది మే నెల ప్రారంభంలో.. మాల్దీవుల పర్యాటక మంత్రి భారతీయ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో మాల్దీవులను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

READ MORE:Sai Durgha Tej: అందుకే పవన్‌ కల్యాణ్‌ మామయ్యను ఎత్తుకున్నా: సాయి తేజ్‌

భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తత ఎలా మొదలైంది?
ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత, మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు ప్రధాని పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం ముదిరింది. ఈ వ్యవహారంపై వివాదం ముదిరిపోవడంతో ఈ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు. రెండు దేశాల ఈ ఉద్రిక్తత మధ్య, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూ చైనాలో ఐదు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ముయిజు భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించారు. ముయిజు మాల్దీవులకు తిరిగి వచ్చిన వెంటనే.. మనది చిన్న దేశమే కావచ్చు కానీ మనల్ని బెదిరించే లైసెన్సు ఎవరికీ ఇవ్వదని చెప్పాడు. అయితే ముయిజు మాత్రం ఎవరి పేరును తీసుకుని నేరుగా ఈ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అయితే వారి లక్ష్యం భారత్ వైపే అని భావిస్తున్నారు. దీని తరువాత.. ముయిజు మార్చి 15 లోపు మాల్దీవుల నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరింది. దీంతో ఇరు దేశాల మధ్య సంత్సంబంధాలు క్షీణించాయి.