Site icon NTV Telugu

India- Maldives conflict: భారత సైనికులను తరిమికొట్టేందుకే తనకు ఓటేశారు.. ఖాళీ కూర్చీల ముందు ముయిజ్జూ ప్రసంగం..

Maldivisb

Maldivisb

India- Maldives Row: మాల్దీవులలో భారీ ప్రతిష్టంభన కొనసాగుతుంది. అయితే, భారత వ్యతిరేక వైఖరిని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ కొనసాగిస్తున్నారు. ఇవాళ మాల్దీవుల పార్లమెంటులో తన ప్రసంగం సందర్భంగా మరోసారి భారత్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులను తరిమికొట్టేందుకే మాల్దీవుల ప్రజలు తనకు ఓటు వేశారని అన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించమని భారత్‌పై విరుచుకుపడ్డారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయి.. దీనికి భారతదేశం- మాల్దీవులు అంగీకరించినట్లు ఆయన చెప్పారు.

Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. 16కు వాయిదా

అయితే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ పార్లమెంట్‌లో ఖాళీ కూర్చిలకు తన ప్రసంగం వినిపించాడు. ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి కారణంగా విపక్షాలు తన ప్రసంగాన్ని బహిష్కరించాయి. ముయిజ్జూ ప్రసంగానికి ముందే మాల్దీవుల్లోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ- డెమొక్రాట్స్ పార్టీలు పార్లమెంట్ కు వచ్చేందేకు నిరాకరించాయి. అధ్యక్షుడు మాల్దీవుల పార్లమెంటుకు చేరుకునే సరికి దాదాపు చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముయిజ్జూ ప్రసంగిస్తున్నప్పుడు కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే సభలో ఉన్నారు.

Read Also: Viral Video : ఏందీ భయ్యా ఇది.. అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి..

ఇక, 87 స్థానాలున్న మాల్దీవుల పార్లమెంటులో మొత్తం 56 మంది ఎంపీలు ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించారు. వీరిలో డెమోక్రాట్‌ల నుంచి 13 మంది, ఎమ్‌డీపీకి చెందిన 43 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఉదయం 9:00 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మాల్దీవుల పార్లమెంటు చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ అని స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. MDP- డెమొక్రాట్‌లు కూడా అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు.

Exit mobile version