NTV Telugu Site icon

Maldives: అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు.. సుప్రీంకు ముయిజ్జు ప్రభుత్వం

Maldives

Maldives

Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ అధికారాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియకు సంబంధించి పార్లమెంటు విధివిధానాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటార్నీ జనరల్ అహ్మద్ ఉషమ్ మంగళవారం నాడు సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన కేసు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించిన తదుపరి సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

Read Also: Chhattisgarh: మావోయిస్టుల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు

మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం, మొత్తం ఎంపీల సంఖ్యలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌లను పదవి నుండి తొలగించవచ్చు. అంటే, పీపుల్స్ మజ్లిస్ (మాల్దీవుల పార్లమెంటు)లో ప్రస్తుత సెషన్‌లో 87 మంది ఎంపీలలో 58 మంది కోరుకుంటే, వారు ముయిజ్జును ప్రభుత్వం నుంచి తొలగించవచ్చు. సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) మహ్మద్ ముయిజ్జుపై అభిశంసనను తీసుకురావాలని కోరుతోంది. ప్రస్తుతం పార్లమెంటులో ఎండీపీ మెజారిటీలో ఉంది.

Read Also: Delhi: బడ్జెట్ సెషన్‌పై ఆల్‌పార్టీ మీటింగ్.. ఏం చర్చించారంటే..!

ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎండీపీ నియంత్రణలో ఉంది. మంత్రులు కావడానికి 7 మంది సభ్యులు సభకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మొత్తం ఎంపీల సంఖ్య 87 నుంచి 80కి తగ్గింది. అభిశంసన నియమాలను ఎండీపీ మార్చింది. అంతకుముందు, అభిశంసన కోసం మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల ఓట్లు అవసరం. కానీ కొత్త నిబంధన ప్రకారం పార్లమెంటులో ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా మూడింట రెండు వంతుల ఓట్లను లెక్కించనున్నారు. అటువంటి పరిస్థితిలో 54 మంది ఎంపీలు అధ్యక్షుడిని తొలగించవచ్చు.

ఎండీపీకి అధ్యక్షుడిని తొలగించగల 54 మంది ఎంపీలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కారణంగా ముయిజ్జు ప్రభుత్వం భయపడుతోంది. ప్రస్తుతం ఎండీపీకి 44 మంది ఎంపీలు ఉన్నారు. కాగా డెమోక్రాట్‌లకు 13 మంది ఎంపీలు ఉన్నారు. రెండు పార్టీలకు కలిపి 57 మంది ఎంపీలు ఉన్నారు. నివేదికల ప్రకారం, అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడానికి ఎండీపీ తగినంత సంతకాలను పొందింది. ప్రతిపాదన తీసుకురావాలంటే 26 మంది ఎంపీల సంతకాలు అవసరం.