100% Muslim Country: ఒకప్పుడు ఇది హిందూ రాజ్యం.. ఇప్పుడు 100% ముస్లిం జనాభా నివసిస్తున్న ఏకైక దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
100% Muslim Country: ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాల్లో విభిన్న మతాలకు చెందిన వాళ్లు నివసిస్తుంటారు. ప్రతి దేశంలో మెజార్టీ మతాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. 100% ముస్లిం జనాభా ఉన్న దేశంలో గురించి చర్చిద్దాం. వాస్తవానికి.. ఒకప్పుడు ఈ దేశాన్ని హిందు రాజులు పాలించారు. కానీ.. కాల క్రమేణా ఇది ముస్లిం దేశంగా మారిపోయింది. ఆ దేశం పేరేంటి? అని ఆలోచిస్తున్నారా? అదేనండి.. మన పొరుగున ఉన్న మల్దీవులు. మల్దీవులు దాదాపు 1200 దీవుల సమూహం. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది. మాల్దీవులలోని 200 దీవులలో మాత్రమే జనాభా నివసిస్తుంది. అయితే 12 దీవులు పర్యాటకుల కోసం కేటాయించారు. ఇక్కడ రిసార్ట్లు, హోటళ్ళు, పర్యాటకులు సందర్శించడానికి సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు ఆరు లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఎక్కువ మంది పర్యాటకులు భారతదేశం నుంచే వస్తారు. దాని ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
Also Read
ఈ దేశం ప్రస్తుతం 100% ముస్లిం దేశంగా మారింది. కానీ, పన్నెండవ శతాబ్దం కిందట మాల్దీవులు హిందూ రాజుల పాలనలో ఉండేవి. తరువాత ఇది బౌద్ధమత కేంద్రంగా కూడా మారింది. తమిళ చోళ రాజులు సైతం పాలించారు. కానీ ఆ తర్వాత ఇది నెమ్మదిగా ముస్లిం దేశంగా మారడం ప్రారంభించింది. ఇస్లాం మాల్దీవుల అధికారిక మతం. “ముస్లిం కాని వ్యక్తి మాల్దీవుల పౌరుడు కాలేడు”. అంటే నూటికి నూరు శాతం ఆదేశంలో ముస్లింలు మాత్రమే ఉంటారు. చారిత్రక ఆధారాలు, ఇతిహాసాల ప్రకారం, మాల్దీవుల చరిత్ర 2,500 సంవత్సరాల నాటిది. మాల్దీవులలో మొట్టమొదటి గుజరాతీలు నివసించేరని చెబుతారు. భారత్ నుంచి గుజరాతీలు క్రీ.పూ. 500 ప్రాంతంలో శ్రీలంకకు వచ్చి స్థిరపడ్డారు. అక్కడి నుంచి కొందరు మాల్దీవులకు వలస వచ్చారు. మాల్దీవుల మొదటి నివాసులు ధేవిలు అని పిలువబడే వర్గానికి చెందిన వాళ్లట. వారు భారతదేశంలోని కాలిబంగన్ నుంచి అక్కడికి చేరుకున్నారు. సౌర రాజవంశం మాల్దీవులను పాలించిన రాజులుగా చెబుతున్నారు.
READ MORE: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్మెంట్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!