కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. కొచ్చిలో సోమవారం రాత్రి మోడీతో వ్యక్తిగతంగా 45 నిమిషాల పాటు చర్చించారు. చిన్నప్పటి నుంచి మోడీని చూస్తూ పెరిగానని తాజాగా ప్రధానిని కలిసినందుకు తన ఆనందానికి అవధులు లేవని ఉన్ని ముకుందన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ప్రధాని మోడీతో మాట్లాడిన ఆ మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో హీరో ఉన్ని ఎమోషన్ పోస్ట్ చేశాడు.
Also Read : Deve Gowda : అమిత్ షాకు దమ్కీ ఇచ్చిన మాజీ ప్రధాని
నా ఫేస్ బుక్ అకౌంట్ లో ఇదే చాలా పవర్ ఫుల్ పోస్ట్.. నా 14 ఏళ్ల వయసు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అంటూ కేరళ యాక్టర్ ఉన్ని ముకుందన్ అన్నారు. నిజంగా మిమ్మల్ని కలవాలనే కోరిక నేడు నిజమైంది.. మీరు నన్ను గుజరాతీ భాషలో కేమ్ చో భైలా అని పలకరించడం విని షాక్ అయ్యాను అని ఉన్ని ముకుందన్ తెలిపారు. మిమ్మల్ని కలిసి గుజరాతీలో మాట్లాడలనేది నా జీవితంలోని పెద్ద కల. అది నేడు నెరవేరింది అన్నాడు. మీతో మాట్లాడిన ఈ 45 నిమిషాలు నా జీవితంలో గొప్పవి.. మీరు చెప్పిన ప్రతి మాట మర్చిపోలేను.. మీరిచ్చిన ప్రతి సలహా ఆచరణలో పెట్టడంతో పాటు అమలు చేస్తాను అంటూ మోడీతో ఉన్న ఫోటోలను ఉన్ని ముకుందన్ షేర్ చేశాడు.
Also Read : Vijay Deverakonda: ముంబైలో ‘మ్యూజిక్ స్కూల్’ ట్రైలర్ ఆవిష్కరణ!
కాగా.. మలయాళ నటుడైన ఉన్ని ముకుందన్.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత భాగమతి, ఖిలాడీ, యశోద వంటి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ముకుందన్ మలయాళ నటుడు అయినప్పటికీ అతని బాల్యం మొత్తం గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లోనే సాగింది. గుజరాత్ లో దాదాపు 20 సంవత్సరాలు ఉన్నారు. అందుకే ముకుందన్ ను ప్రధాని మోడీ గుజరాతీలో పలకరించారు. ఇదిలా ఉండగా ఉన్ని ముకుందన్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రధాని మోడీని కలవడంతో ఈ ఊహలకు మరింత బలం చేకూరుస్తోంది.