NTV Telugu Site icon

Malavika Mohanan: అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ చెప్పలేదు.. తప్పక చేయాల్సి వచ్చింది!

Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan Cooments on Thangalaan Shooting: పా.రంజిత్‌ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ‘తంగలాన్‌’. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు కీలక పాత్రలు చేశారు. ఆగస్టు 15న తంగలాన్‌ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు.

ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ… ‘ఒకరోజు నేను సెట్‌కు వెళ్లే సరికి పెద్ద గేదె ఉంది. డైరెక్టర్ నా వద్దకు వచ్చి దానిపై ఎక్కగలవా అని అడిగారు. ఏదో సరదాగా అన్నారనుకున్నా. నా మేకప్‌ పూర్తయిన తర్వాత గేదెపై కూర్చోమన్నారు. నేను ఎప్పుడూ గేదె పైకి ఎక్కలేదని చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. షూట్ చేయాలి, గేదెపై కూర్చో అన్నారు. చాలా భయంతోనే దానిపై ఎక్కాను. త్వరగానే ఆ షాట్ పూర్తయింది. అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ నాకు ముందుగా చెప్పలేదు. అందుకే ఒక్కసారిగా షాక్ అయ్యా’ అని తెలిపారు.

Also Read: Cobra Viral Video: మద్యం మత్తులో నాగుపాముతో ఆటలాడిన నాగరాజు.. కాటు వేయడంతో పరిస్థితి విషమం!

‘తంగలాన్‌ సినిమా కోసం నేను 5 గంటలు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. స్కిన్‌ స్పెషలిస్ట్‌, కంటి డాక్టర్‌ ఇలా ఐదుగురు వైద్యులను కలిశాను. ఒక్కోరోజు దాదాపు 10 గంటల పాటు కెమికల్స్‌తో చేసిన మేకప్‌ శరీరంపై ఉండేది. దాంతో నాకు ఎలర్జీ వచ్చింది. ఒక్కోసారి ఈ షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా? అని అనిపించింది’ అని మాళవిక మోహనన్‌ చెప్పారు. తంగలాన్‌లో నటీనటులందరూ డీ గ్లామరైజ్‌గా కనిపించనున్నారు. అందుకు భారీగా మేకప్ వేసుకోవాల్సి వచ్చింది.

Show comments