NTV Telugu Site icon

Reels Effect: రీల్స్‌ చేస్తూ 6వ అంతస్తు నుంచి కింద పడ్డ బాలిక.. (వీడియో)

Viral Reel Making

Viral Reel Making

Reels Effect: రీల్స్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేందుకు ప్రస్తుతం చాలామంది దేనికైనా సిద్ధపడిపోతున్నారు. చాలామంది యువకులు రీల్స్ చేయాలనే తపనతో చివరకి వారి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము. చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వారి జీవితాలతో చెలగాటం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ బిల్డింగ్ బాల్కనీలో రీలు తీస్తుండగా ఓ యువతి ఆరో అంతస్తు నుంచి నేరుగా వీధిలో పడిపోయింది. వీధిలో ఆమె ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Snake Byte: ప్లాస్టిక్ బ్యాగ్ లో పామును తీసుకొచ్చి ఆస్పత్రిలో హంగామా చేసిన యువకుడు..

ఈ ప్రమాదంలో గాయపడిన అమ్మాయి వయస్సు 16 ఏళ్లు. ఘజియాబాద్‌ లోని ఇందిరాపూర్‌ లోని క్లౌడ్ 9 సొసైటీలోని ఆరవ అంతస్తులో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇంటి బాల్కనీలో రీల్‌ షూట్‌ చేస్తుండగా.. బాలిక మొబైల్‌ ఫోన్‌ బాల్కనీ నుంచి కింద పడింది. మొబైల్‌ ని లాక్కోవడానికి అమ్మాయి చాలా కష్టపడింది. అయితే., మొబైల్ ను కిందపడుకుండా ప్రయత్నంలో ఆమె కూడా అంత ఎత్తు నుండి కింద పడిపోయింది. అమ్మాయి కిందపడిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె కేకలు వేయడంతో పలువురు ఆమె చుట్టూ గుమిగూడారు. గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాలిక తల్లి కూడా అక్కడికి చేరుకోవడంతో బాలికపై అరవడం ప్రారంభించింది. కానీ., ఆ అమ్మాయి మాత్రం “అమ్మా, నాన్నని పిలవండి” అని అరుస్తూనే ఉంది. స్థానికులు బాలికను అక్కడే నిలిపి ఉంచిన వాహనంలో ఎక్కించి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు.

Independence Day: రక్తంతో స్వాతంత్య్ర సమరయోధులకు చిత్రనివాళి అర్పించిన ఆర్టిస్ట్ కోటేష్..

ఇంతలో, ప్రత్యక్ష సాక్షులు తీసిన ఈ వీడియోలో అమ్మాయి తల్లి ఆమెతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. రీల్స్ చేయడం తన అభిరుచి గురించి తల్లి మాట్లాడుతూ.., పిల్లలు తల్లిదండ్రుల పేరు చెడగొట్టే పని చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు బాలికను ఆసుపత్రికి తరలించగా.. ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఆమె ప్రమాదం నుండి బయటపడింది.