యాపిల్, క్యారెట్, బీట్‌రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. దాని రెసిపీ కూడా తెలుసుకోండి. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఎర్రరక్తకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
Soaked Dates: నానబెట్టిన ఎండు ఖర్జూరాలు తింటే మీ శక్తికి కొదవే లేదు.. వాటికి చాలా మంచిది..!
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
ఈ తక్కువ కేలరీల పానీయం బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. ఇది మీరు ఎక్కువ కాలం నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా.. ఈ పానీయంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ జ్యూస్ రిసిపిని ఎలా తయారు చేయాలి..?
కావాల్సిన పదార్ధాలు
1 గ్లాస్ నీరు
1 టేబుల్ స్పూన్ తేనె
1 టీస్పూన్ నిమ్మరసం
క్యారెట్
బీట్‌రూట్
ఆపిల్
బీట్‌రూట్, క్యారెట్, యాపిల్ ముక్కలను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని బ్లెండర్ లేదా జ్యూసర్‌లో వేసి నీరు కలపండి. ఒక గ్లాసులో రసాన్ని ఫిల్టర్ చేయండి. రుచికి అనుగుణంగా నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి. ఈ పానీయం తాగడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడైతే మంచింది.