టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ కు సంబంధించిన ఓ పాత పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ పోస్ట్ లో గతేడాది (2022) డిసెంబర్ 31న తాను ఏ లక్ష్యాలు పెట్టుకున్నానో చెప్పాడు. అయితే అందులో శుభ్‌మాన్ ఆ లక్ష్యాలను చాలా వరకు సాధించాడు. గతేడాది గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో అన్నింటినీ అధిగమించాడు.. కానీ ఒక్కటి నెరవేరలేదు. అదేంటంటే.. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం. కాగా.. గిల్ ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Uttar Pradesh: ఐదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి అత్యాచారం..
గిల్ పెట్టుకున్న లక్ష్యాలలో.. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించడం, ప్రపంచ కప్ గెలవడం, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం, ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ గెలవడం, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తనవంతు కృషి చేయడం.. ఇందులో ఒక్కటి తప్ప అన్నీ లక్ష్యాలు నెరవేరాయి. ఏదేమైనప్పటికీ గిల్ పేపర్ పై రాసుకున్న ఈ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా గిల్ 2024లో కూడా మరిన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటిని కూడా నెరవేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు. వన్డే, టీ20ల్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. టెస్ట్ ఫార్మాట్‌లో విఫలమయ్యాడు. శుభ్‌మాన్ తన టెస్ట్ ఫామ్‌పై విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.
Read Also: Political Heat In Kakinada: కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్.. గోదారి గట్టున గెట్ టుగెదర్