Site icon NTV Telugu

Adult Content: నీలిచిత్రాల కంపెనీ విచిత్ర విజ్ఞప్తి.. అడల్ట్ కంటెంట్ అంటే బోరింగ్ అనేలా చేయండి..

Adult Content

Adult Content

Adult Content: నీలి చిత్రాలు అందించే పోర్న్ హబ్ ఓ విచిత్ర విజ్ఞప్తి చేసింది. తమపై ఒత్తిడి తేవడానికి బదులు, పోర్న్ అంటే బోరింగ్ అనేలా.. నీలి చిత్రాలను సాధారణ విషయంగా మార్చడం గురించి ఆలోచించాలని ప్రభుత్వాలను కోరింది. అంతేకానీ, పోర్న్ వెబ్ సైట్‌లపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పోర్న్ హబ్ కొత్త యజమాని తెలిపారు.

పోర్న్ హబ్ మాతృసంస్థ మైండ్ జీక్‌ను మూడు నెలల క్రితం కెనడాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఎథికల్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ (ఈసీపీ) అనే ఈక్విటీ కంపెనీ కొనుగోలు చేసింది. యూపోర్న్ సహా పలు నీలిచిత్రాల వెబ్ సైట్లు మైండ్ జీక్ కిందనే పని చేస్తాయి. ఈ కొనుగోలు కొత్త యాజమాన్యానికి అనేక సమస్యలను తెచ్చి పెట్టింది. పోర్న్ చిత్రాలను ఏ వయసు వారు చూస్తున్నారో వెరిఫై చేయాలని ఆదేశాలు జారీ అయిన తర్వాత అమెరికాలోని ఉటా రాష్ట్రం ఈ వెబ్ సైట్‌లను తొలగించింది. ఫ్రాన్స్‌లో పోర్న్ వెబ్ సైట్ ఓనర్లు, రెగ్యులేటర్లు కొన్ని నెలలుగా ఏజ్ వెరిఫికేషన్ 2020 చట్టాన్ని ఎలా అమల్లోకి తేవాలనే అంశంపై చర్చ చేస్తున్నారు. మైండ్ జీక్‌కు చెందిన రెండు పోర్న్ సైట్లు ఏజ్ వెరిఫికేషన్ పెట్టలేదు. దీంతో వాటిని బ్యాన్ చేయాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది.

Also Read: Malli Pelli OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘మళ్లీపెళ్లి’..మూడు రోజుల్లోనే 100 మిలియన్

ఈసీపీ వ్యవస్థాపకుడు సోలోమన్ ఫ్రీడ్‌మాన్ మీడియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మైనర్లు తమ వెబ్ సైట్‌లోని పోర్న్ వీడియోలు చూడాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. కానీ, చూడకుండా కట్డడి చేసే బాధ్యతను పూర్తిగా వెబ్‌సైట్లపైనే వదిలిపెట్టడం సరి కాదని వివరించారు. ఆపరేటింగ్ సిస్టమ్‌లో మార్పుల ద్వారా దీనికి పరిష్కారం వెతకాలని చెప్పారు. డివైజ్, బ్రౌజర్ ద్వారా ఈ ఏజ్ వెరిఫికేషన్‌ను సమర్థవంతంగా చేయవచ్చని వివరించారు. గూగుల్, ఆపిల్ సంస్థలకు ఇది చాలా చిన్న విషయం అని పేర్కొన్నారు.

మైండ్ జీక్ వెబ్‌సైట్‌లలో మైనర్లతో ప్రమేయం ఉన్న నీలి చిత్రాలను, రేప్‌ల వీడియోలను ఉన్నాయనే ఆరోపణలు ఉన్నట్టు 2020లో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనం అనేక దేశాల్లో ఒత్తిడిని తెచ్చింది. వీసా, మాస్టర్ కార్డ్ వంటివి ఈ సైట్‌లకు పేమెంట్ ప్రక్రియలను నిలిపేశాయి. ఈ సంస్థను అమ్మేయాలని దాని యజమానులు రెండేళ్లపాటు ప్రయత్నాలు చేశారు. కెనడాలో ఈ సంస్థ కార్యకలాపాలు అధికంగా ఉన్నా.. సంక్లిష్టమైన కార్పొరేట్ స్ట్రక్చర్ దీనికి ఉంటుంది. పన్నుల ఎగవేతలకు అవకాశం ఉన్న దేశాలు సహా లగ్జెంబర్గ్‌లోనూ వీటి హెడ్ క్వార్టర్లు ఉన్నాయి.

Exit mobile version