NTV Telugu Site icon

Makara Jyothi 2024: భక్తులకు దర్శనమిచ్చిన మకర జ్యోతి.. శరుణఘోషతో మార్మోగిన శబరిగిరులు

Makara Jyothi

Makara Jyothi

Makara Jyothi 2024: శబరిగిరులు స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో పులకించాయి. అయ్యప్ప నామస్మరణతో భక్తుల హృదయాలు పరవశించిపోయాయి. శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేసింది. భక్తులకు మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరిగింది. భక్తులకు మూడు సార్లు మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం కోసం అక్కడికి చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. అరుదైన దృశ్యాన్ని చూసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ఉప్పొంగిపోయారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా.. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగతుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Rooster Fight: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు.. లక్షల్లో బెట్టింగ్, చేతులు మారుతున్న కోట్లు

ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం. అయితే ఈ సంవత్సరం కూడా భక్తులకు జ్యోతి దర్శనం కావడంతో భక్తులు భక్తితో పరవశించిపోయారు. ఈ క్రమంలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధతో అయ్యప్పను పూజించారు. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. 50 వేల మందికి ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు టోకెన్లు ఇచ్చింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీ కోసో ఏర్పాటు చేశారు.

Read Also: Kodi Pandalu: వెయ్యి కట్టు.. బైక్ పట్టు.. పందెం బరుల వద్ద కూపన్ల ఆఫర్లు

ప్రతి సంవత్సరం మకర జ్యోతి కనిపిస్తుంది. అయితే అక్కడి ప్రజలు దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తు స్వామి వారిని పూజా కార్యక్రమాలు చేసి జ్యోతిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి ఇరుముడి సమర్పించి స్వాములు ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. అయ్యప్ప భక్తులు మండలకాలంపాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకున్నారు. పంబాన నదిలో స్నానం ఆచరించి రాళ్లదారుల్లో, అడవి మార్గంలో నడిచి సన్నిధానాన్ని చేరుకున్న స్వాములకు. శబరిగిరీశుని జ్యోతి దర్శన భాగ్యం కలగడంతో పులకరించిపోయారు.

Show comments