Site icon NTV Telugu

Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనం పరుగులు..

Hyd

Hyd

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్థరాత్రి సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. దీంతో మంటలను చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు.

Read Also: Adani Group : రూ.3000కోట్లతో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్

ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చాలా సేపు కష్టపడ్డారు. ఈ ఘటనలో నాలుగు షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక, ఈ సంఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే, ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం ఎలా సంబవించింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Exit mobile version