ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహదుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నక్సలైట్లు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రన్న తలపై ఇప్పటికే రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.
READ MORE: Operation Sindoor: టెర్రరిస్ట్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం.. యూఎస్ జర్నలిస్ట్ హత్యకు భారత్ ప్రతీకారం..
మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హామీ ఇచ్చినప్పటి నుంచి.. నక్సల్స్‌కు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలు.. మావోయిస్టులకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తరచూ సెక్యూరిటీ ఫోర్స్, నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో 8 మంది మృతి చెందారు.
READ MORE: Operation Sindoor: టెర్రరిస్ట్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం.. యూఎస్ జర్నలిస్ట్ హత్యకు భారత్ ప్రతీకారం..
