Odisha : ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.
Read Also:SRH vs RCB: సన్ రైజర్స్ విక్టరీ.. 25 రన్స్ తేడాతో గెలుపు
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై సోమవారం 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్ నుండి పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. క్షతగాత్రులు కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.
Read Also:Attack on CM YS Jagan Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం..
ఘటనా స్థలానికి సమీపంలోని బస్టాండ్‌లో ఉన్నామని, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అస్తవ్యస్తంగా డ్రైవింగ్ చేయడం చూశామని స్థానికులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ తాగి ఉన్నాడని భావిస్తున్నామని ప్రజలు చెప్పారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
#WATCH | Odisha: 5 people died and many injured after a bus fell from flyover in Jajpur. pic.twitter.com/4riCIzVrvY
— ANI (@ANI) April 15, 2024