Election Bonds: ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలను పొందిన భారతీయ జనతా పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషన్ గురువారం నాడు విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు లభించిన విరాళాల్లో కేవలం బీజేపీకే సుమారు 48 శాతం సొమ్ము చేరడంతో మహువా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
Read Also: Madhyapradesh : జైలు నుంచి వచ్చి.. లవర్ కుటుంబాన్ని నరికి ఫ్రిజ్ లో పెట్టాడు
ఇక, ఒక దేశం, ఒక గురువు, ఒక ఈడీ, ఒక ఐటీ, ఒక సీబీఐ, ఒకే రాజకీయ పార్టీ అంటూ తన ట్విట్టర్ ( ఎక్స్ )లో మాజీ ఎంపీ మహువా మొయిత్రా పేర్కొనింది. విరాళాల్లో 55 శాతం.. మహా అద్భుతం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక, మహువా తాను చేసిన ట్వీట్‌లో బీజేపీకి 55 శాతం విరాళాలు వచ్చాయని తెలిపింది. కానీ ఆ పార్టీకి సుమారు 48 శాతం వరకు విరాళాలు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం తెలుస్తుంది.
Read Also: PM Modi: నేడు నాగర్‌కర్నూల్‌కు మోడీ.. బహిరంగ సభ
అయితే, తృణమూల్ కాంగ్రెస్ రూ. 1,609 కోట్లతో రెండో అతిపెద్ద ఎలక్టోరల్ బాండ్లు పొందిన పార్టీగా ఉంది అనే విషయాన్ని బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ (రూ. 1,422 కోట్లు), బీఆర్‌ఎస్ (రూ. 1,215 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మొయిత్రా చెప్పడం మర్చిపోయారు అంటూ కమల నాథులు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మొత్తం మొత్తంలో 13శాతం వాటాతో 1,610 కోట్ల రూపాయల మేరకు లబ్ధి పొందగలిగింది.. అదనంగా, మహువా మోయిత్రా క్లెయిమ్ చేసినట్లు 55శాతం కాదు.. మొత్తం బాండ్లలో 48 శాతం కంటే తక్కువ బీజేపీకి వచ్చింది అని పేర్కొంటున్నారు.
One country. One Guru. One ED. One IT. One CBI.
One Political Party. 55 percent of all donations. Go figure.— Mahua Moitra (@MahuaMoitra) March 15, 2024