NTV Telugu Site icon

Mahua Moitra: మహువా మొయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించిన టీఎంసీ అధినేత్రి

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపిన తర్వాత.. మహువా మొయిత్రాకు టీఎంసీ కొత్త బాధ్యతను అప్పగించింది.

Read Also: Physical Harassment: ఆగ్రాలో దారుణం.. హోటల్‌లో పనిచేసే మహిళపై సామూహిక అత్యాచారం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంపి మహువా మోయిత్రాకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ (నాడియా నార్త్) అధ్యక్షురాలిగా మొయిత్రాను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నియమించారు. ఈ సందర్భంగా.. మమతా బెనర్జీకి మొయిత్రా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “నన్ను కృష్ణానగర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు మమతా బెనర్జీ, టీఎంసీకి ధన్యవాదాలు. కృష్ణానగర్ ప్రజల కోసం ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తాను. అని మోయిత్రి తెలిపింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: SBI Recruitment 2023 : SBI లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Show comments