Site icon NTV Telugu

Mahindra XUV 7XO: 540-డిగ్రీ కెమెరా, ట్రిపుల్-స్క్రీన్, లెవెల్ 2 ADAS తో.. మహీంద్రా XUV 7XO విడుదల.. ధర ఎంతంటే?

Mahindra Xuv 7xo

Mahindra Xuv 7xo

దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా కంపెనీ వెహికల్స్ కు మార్కెట్ లో క్రేజీ డిమాండ్ ఉంటుంది. గతేడాదిలో ఏకంగా 6 లక్షల వాహనాలను విక్రయించి సేల్స్ లో దుమ్ము రేపింది. తాజాగా మరో SUVతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ తన కొత్త SUV, మహీంద్రా XUV 7XOను అధికారికంగా విడుదల చేసింది. ఈ SUV ని గతంలో XUV 700 గా అందించేవారు, కానీ ఇప్పుడు, దాని ఫేస్ లిఫ్ట్ తో పాటు, తయారీదారు దాని పేరును కూడా మార్చింది.

Also Read:OnePlus 13 Price Drop: 10 వేలకే ‘వన్‌ప్లస్‌ 13’.. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు బాసూ!

ఫీచర్లు

కంపెనీఈ SUVలో హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, 540-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS, లేన్ డిపార్చర్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, బాస్ మోడ్, వెనుక సీటు స్క్రీన్‌లు, అడ్రినో, పుల్ ఫ్రంట్-ఫేసింగ్ స్క్రీన్ వంటి అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. SUVలో మొదటిసారిగా అలెక్సా, చాట్ జీపీఎస్ కూడా ఉన్నాయి. మహీంద్రా 200 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను, 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో పాటు ఆరు-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపికను అందిస్తుంది.

Also Read:Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!

కంపెనీ ఈ SUV ని రూ.13.66 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.24.1 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర ప్రారంభ 40,000 యూనిట్లకు. ఈ తేదీ తర్వాత ధరలు మారవచ్చు. ప్రీ-బుకింగ్‌లు డిసెంబర్ 2025లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు జనవరి 14న ప్రారంభమవుతాయి.

Exit mobile version