Site icon NTV Telugu

Mahindra Vehicles: రూ.1000 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రం.. సర్కారుతో కుదిరిన ఒప్పందం

Mahindra

Mahindra

Mahindra Vehicles: మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్లు తెలిపింది. ఈరోజు ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా కంపెనీ తన లాస్ట్ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా 3 & 4 వీలర్ వాహనాలను తయారుచేయునట్లు తెలిపింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

Read Also: Gold Smuggling : తమిళనాడులో రూ.10కోట్లు విలువగల బంగారం పట్టివేత

ప్రస్తుతం జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్ ను విస్తరించేందుకు ఈ అవగాహన ఒప్పందం ఉపకరిస్తుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ విస్తరణ ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులోనూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అంశం పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారతదేశంలో సస్టైనబుల్ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

Read Also: Heroines: మా పెళ్లే మాకు యాపారం అంటూ కోట్లు సంపాదిస్తున్నారే..?

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని, మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కంపెనీకి జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్ ను మరింత విస్తరించడం ద్వారా త్రీ వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ప్రకటించిన తాజా పెట్టుబడితో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Exit mobile version