Site icon NTV Telugu

Maheshwar Reddy : రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయాడా…. గజినిగా మారాడా

Maheshwar Reddy

Maheshwar Reddy

రేవంత్ రెడ్డి మతిస్థిమితం కొల్పోయాడా…. గజినిగా మారాడా అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని, కాళేశ్వరం పోయింది పోన్ ట్యాపింగ్ వచ్చింది… పోన్ ట్యాపింగ్ పోయి మరో అంశం తెరపైకి తెచ్చారన్నారు మహేశ్వర్‌ రెడ్డి. రెఫరెండం అన్నావు 14 సీట్లు గెలుస్తామని అన్నావు… 14 గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మీరు స్పందించలేదని, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు కలిసి డ్రామా ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హరీష్ రేవంత్ ల చీకటి ఒప్పందం లో భాగంగానే ఈ రాజీనామా లా నాటకమని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు హరీష్ రావు నాయకత్వం వహిస్తారని అనుమానం వస్తుందని మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

అంతేకాకుండా..’రుణమాఫీ మీద హంగామా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు బాలకృష్ణ అభిమానివి అని తెలుసు… హామీలు నెరవేర్చక పోతే ప్రభుత్వం ఎందుకు అని డైలాగ్ లు కొడుతున్నావు. ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షలు ఇస్తా అన్నావు దాని సంగతి మర్చిపోయావా. ప్రతి ఎస్సీ ఎస్టి కుటుంబానికి 12 లక్షలు ఇస్తా అన్నది మర్చిపోయావా. గాంధీ భవన్ కు నా లెటర్ హెడ్ పంపిస్తున్న దాని మీద రాజీనామా ఫార్మాట్ లో పంపించు… మీరు ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఒక ఫేక్ సీఎం వి, అబద్దాల ముఖ్యమంత్రి. రాజ్యాంగం నీ అత్యధిక సార్లు సవరించిన పార్టీ కాంగ్రెస్. మైనారిటీ రిజర్వేషన్ ల వల్ల బీసీ, ఎస్సీ ఎస్టీ లకు అన్యాయం చేసింది వాస్తవం కాదా. బీసీ స్థానాల్లో ముస్లిం లు పోటీ చేస్తున్నది వాస్తవం కాదా. కాంగ్రెస్ అధికారం లోకి 12 శాతం రిజర్వేషన్ లు అమలు చేస్తుంది .. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి మీ కెప్టెన్ ఎవరు… ఎగిరెగిరి పడుతున్నావు… నీ పార్టీ ఏడున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కి తక్కువ ప్రాంతీయ పార్టీ కి ఎక్కువ’ అని మహేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు.

Exit mobile version