కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్ సహా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ‘రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి పౌరుడు రాజశేఖరరెడ్డిని చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారు. రైతే ద్యేయంగా పాలన చేసినటువంటి గొప్ప వ్యక్తిఆ ఆయన. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్‌ను గుర్తుంచుకుంటారు’ అని చెప్పారు. కేవీపీ రామచంద్రరావు, దానం నాగేందర్ మహానేత వైఎస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.
Also Read: Kaleshwaram Project: కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట!
వైస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్, కోడలు వైఎస్ భారతిలు నివాళులు అర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు మహానేతను స్మరించుకున్నారు.
