NTV Telugu Site icon

Mahesh Kumar Goud : ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురైనవి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్టిల్, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారని, దురాక్రమనకు గురైన ప్రభుత్వ భూములను ఇంచు వదలకుండా కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో ముందుకు పోతున్నారని, ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని ఆయన అన్నారు.

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కడితే… హరీష్ రావు ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మీరు ఎందుకు కాళ్ళు, చేతులు ముడుచుక కూర్చున్నారని, పది ఏళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు ఎంతమంది అని ఆయన అన్నారు. చట్టానికి చుట్టాలు లేరని, ఎవరైనా చూసేది లేదు ఎంత పెద్ద వారిని అయినా వదిలేదిలేదన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. కాంగ్రెస్ నాయకులవి కూడా కూలగోడుతున్నారని, దూర దృష్టితో దురాక్రమనకు గురైన చెరువులు కుంటలను కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌.

APOLLO-BROEC: అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్..