Site icon NTV Telugu

Mahesh Kumar Goud : బీజేపీ మమ్మల్ని తప్పుపడుతూ.. వాళ్ళు సత్యమంతులాగా మట్లాడుతున్నారు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేసింది మోడీ సర్కారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకౌంట్ సీజ్ చేసి 100 కోట్లు విత్ డ్రా చేసుకుందని, 14 లక్షల రూపాయలు.. ఎంపీ లు క్యాష్ రూపంలో ఇచ్చారు అని అకౌంట్స్ క్లోజ్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బీజేపీ రాజకీయ దిగజారుడు తనం కి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఉన్న డబ్బులు ఖర్చు చేయకుండా ఆంక్షలు పెట్టడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు.

Bandi Ramesh : మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలి

అంతేకాకుండా.. రాజకీయ పార్టీలు ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి రావని ఆయన వెల్లడించారు. కానీ బీజేపీ కాంగ్రెస్ అకౌంట్స్ పై ఐటీ అధికారులతో ఇబ్బంది పెడుతుందని, బీజేపీ మమ్మల్ని తప్పుపడుతూ.. వాళ్ళు సత్యమంతుల లాగా మట్లాడుతున్నారని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. బాండ్ల దోపిడీ… ప్రపంచంలోనే పెద్ద దోపిడీ అని, బాండ్లన్నీ బీజేపీ ఖాతా లోకి వెళ్లాయన్నారు. బీజేపీ క్విడ్ ప్రోకో లో భాగంగానే.. బాండ్ల దందా అని, నీకు పని.. నాకు మని అన్నట్టు బాండ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దావుద్ ఇబ్రహీం మాదిరిగా బెదిరింపు లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

MS Dhoni: ధోనీ ఎందుకిలా చేశావ్‌?.. పెళ్లి నుంచి రిటైర్మెంట్ వరకు అన్ని షాకింగ్ నిర్ణయాలే!

Exit mobile version