Site icon NTV Telugu

Mahesh Babu : ‘వారణాసి’తో వరల్డ్ రికార్డుల వేట.. మహేష్ – జక్కన్న మాస్టర్ ప్లాన్ చూశారా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ “వారణాసి” ఇప్పుడు ప్రపంచ సినిమా రంగాన్నే తన వైపు చెప్పుకుంటోంది. గత నెలలో విడుదలైన గ్లింప్స్ సృష్టించిన సునామీ ఇంకా తగ్గకముందే, మేకర్స్ మరో సెన్సేషనల్ అప్‌డేట్‌తో వచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, కేవలం వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రాజమౌళి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

Also Read : Niharika : ఇదే నిజమైన హ్యాపీనెస్ అంటూ నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఈ సినిమా కేవలం కంటెంట్ పరంగానే కాకుండా, టెక్నికల్ పరంగా కూడా సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇండియన్ సినిమా నుంచి వస్తున్న రెండో ఐమాక్స్ (IMAX) వెర్షన్ సినిమాగా ‘వారణాసి’ గుర్తింపు పొందింది. సాధారణంగా ట్రైలర్లు మామూలు డిజిటల్ ఫార్మాట్‌లో వస్తాయి, కానీ రాజమౌళి టీమ్ డిజిటల్‌గా 1.43 రేషియోలో ఐమ్యాక్స్ వెర్షన్ ట్రైలర్‌ను నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి ప్లానింగ్ ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి అని మేకర్స్ గర్వంగా చెబుతున్నారు.

 

Exit mobile version