టాలివుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ పలు క్రెజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. సాధారణంగా జక్కన్న తన డైరెక్షన్ లో నటిస్తున్న హీరో మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు.
తన సినిమాలో నటించే హీరో లుక్ లీక్ కావడం కూడా జక్కన్నకు అస్సలు ఇష్టం ఉండదనే సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ఈ సినిమా విడుదలైన వెంటనే మహేష్ జక్కన్న కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది..రాజమౌళి సినిమాలు అంటే ఎలాగో ఆలస్యం అవుతుంది.. అయినా మహేష్ వేరే సినిమా చెయ్యడని తెలుస్తుంది..
ఇక త్రివిక్రమ్ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం 100 నుంచి 110 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. జక్కన్న సినిమా కోసం తన లుక్ ను మార్చుకోవడంతో పాటు ఎంతగానో కష్టపడనున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.. ఆ సినిమా గ్యారేంటి పాన్ ఇండియా లెవల్ కు వెళుతుంది.. మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. అంటే మహేష్ మరో రెండు మూడేళ్ల వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది..