Mahesh Babu Completes Dubai Family Vacation: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో మొదటి ఫ్యామిలీ వెకేషన్‌ను పూర్తి చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. నేడు హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాబు హడావుడిగా హైద్రాబాద్ వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దాంతో శనివారం సాయంత్రం జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది.
షూటింగ్‌లకు కాస్త గ్యాప్ దొరికినా, ఏ సందర్భం వచ్చినా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌కు వెలుతారన్న సంగతి తెలిసిందే. బాబు ఏడాదికి కనీసం మూడు ఫ్యామిలీ వెకేషన్లకు వెళుతుంటారు. 2024 న్యూ ఇయర్ సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. వెకేషన్‌లో నమ్రత, గౌతమ్, సితార హంగామా చేశారు. సితార, గౌతమ్‌లు ఎంతలా సందడి చేశారో నమ్రత ఇన్ స్టా పోస్టులు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఎయిర్ పోర్టులో గౌతమ్ జంప్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది.
Also Read: Christian Oliver Dies: కరేబియన్ సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు మృతి!
మహేష్ బాబు తాజా సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇదివరకే విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.