Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!

Social Media Star

Social Media Star

Social Media Star: సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్తేనే క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. తాజాగా ఆయన పెట్టిన ఒకే ఒక్క కామెంట్ ఒక చిన్నారి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘బై స్వీట్లీ క్యూరియస్’ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఓ పాప క్యూట్ వీడియోకి మహేష్ బాబు ఫిదా అయ్యారు. మహేష్ బాబు స్పందనతో ఆ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోవడమే కాకుండా, ఆ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 35 వేల నుంచి 1.73 లక్షలకు చేరుకుంది.

నిజానికి ఆ వీడియోలో ఏముందంటే.. నాన్న చెప్పులు తొడుగుతుంటే ఆ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పోకిరి’లోని “నొప్పి నొప్పి గుండెంత నొప్పి” అంటూ పాట పాడుతూ అదరగొట్టింది. అంతటితో ఆగకుండా తల్లి వంట చేస్తుండగా ‘గుంటూరు కారం’ సినిమాలోని “దమ్ మసాలా” సాంగ్‌ను కూడా ఎంతో ఉత్సాహంగా పాడింది. కూతురు అల్లరి, పాటల జోరు చూసిన తల్లి “వీడియో చూసేవాళ్ళు నిన్ను ఎలా పెంచుతున్నావ్ అనుకుంటారే” అంటూ సరదాగా కౌంటర్ వేసింది.

ఈ క్యూట్ రీల్ సూపర్ స్టార్ మహేష్ బాబు కంటపడడంతో ఆయన తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి స్పందించారు. “హహా.. సో క్యూట్, లాట్స్ ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్” అంటూ లవ్ ఎమోజీలతో కామెంట్ పెట్టారు. మహేష్ బాబు కామెంట్ చేయగానే ఆ రీల్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ మహేష్ బాబుకు అసలైన డై హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ వైరల్ రెస్పాన్స్‌పై ఆ చిన్నారి తల్లి స్పందిస్తూ.. “మహేష్ బాబు రిప్లై ఇవ్వకముందు ఇది కేవలం ఒక ట్రయల్ రీల్ మాత్రమే., మా వల్ల మీరందరూ నవ్వుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.