Site icon NTV Telugu

Khaleja Re Release: అరె ఏంట్రా ఇది.. సినిమా హాలులోకి పామును పట్టుకొచ్చిన మహేష్ అభిమాని..!

Khaleja Re Release

Khaleja Re Release

Khaleja Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ-రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ థియేటర్‌లో భయానకర సంఘటన చోటుచేసుకుంది. ఈ రిలీజ్ సందర్బంగా అభిమానుల ఉత్సాహం అందరినీ అలరించినప్పటికీ, ఓ అభిమాని చేసిన అనూహ్య చర్య మాత్రం థియేటర్ లో కలకలం సృష్టించింది. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎంట్రీ సీన్ ఓ పాముతో నడిచే గెటప్‌లో ఉండగా, అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయాలని విజయవాడలోని బెజవాడ థియేటర్‌కు ఓ అభిమాని నిజమైన పాముతో వచ్చాడు. మొదట అది రబ్బర్ పామని భావించిన అభిమానులు, పాము కదులుతూ ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.

Read Also: Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

ఘటనపై సమాచారం అందుకున్న థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి, ఆ వ్యక్తిని థియేటర్ బయటకు పంపించారు. ఆ తరువాత జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. థియేటర్‌లో ఉన్నవారు కొంత సమయం భయభ్రాంతులకు గురైనట్లు సమాచారం. ఇకపోతే ఈ మధ్య పాత హిట్ సినిమాల రీ-రిలీజ్‌కు మంచి స్పందన లభిస్తోంది. అదే కోవలో మహేష్ బాబు అభిమానులు భారీ స్థాయిలో ‘ఖలేజా’ మూవీని థియేటర్లలో చూడటానికి తరలివచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్‌ బాబు మ్యాజిక్‌ను ఆస్వాదించేందుకు అభిమానులు భారీగా పాల్గొనడంతో పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో థియేటర్లలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అభిమానులు తమ హీరోలను అభిమానించడం మంచిదే కానీ, ఇలాంటి ఘటనలే ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి.

Read Also: PBKS vs RCB: ఇది మర్చిపోలేని రోజు.. అదే మా ఓటమిని శాసించింది: శ్రేయాస్

Exit mobile version