సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కొడుకు బాబీ ‘కవల పిల్లల’ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, భార్య నమ్రత పాల్గొన్నారు.
super star
ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు క్యాజువల్ లుక్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. పుట్టినరోజు వేడుకలో ఇద్దరు చిన్నారులను ఎత్తుకొని సందడి చేశాడు మహేశ్ బాబు.
super star
అలాగే ఈ వేడుకలో మహేశ్ బాబు బావ నటుడు, నిర్మాత సంజయ్ స్వరూప్ తో పాటు మహేశ్ సిస్టర్స్ అయిన మంజుల, పద్మినీ ప్రియదర్శని, గల్లా పద్మ, మేనల్లుడు గల్లా అశోక్ కూడా పాల్గొన్నారు.
Mahesh babu with sisters
ఓ వైపు వారణాసి షూటింగ్ లో బిజీగా ఉన్న మహేశ్ తన సొంత ఫ్యామిలి ఫంక్షన్స్ లో పాల్గొంటూ స్టార్‌డమ్‌కు దూరంగా, కుటుంబ కార్యక్రమాల్లో సాదాసీదాగా పాల్గొనడం మహేశ్ బాబు ప్రత్యేకతగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
mahesh babu with galla ashok
ఆది శేషగిరి రావు మనవడి పుట్టినరోజు వేడుకల్లోని మహేశ్ బాబు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.