Mahatma Ghat : మహోన్నతంగా మహాత్మ ఘాట్
- ప్రపంచంలో ఎత్తయిన గాంధీ విగ్రహం
- ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం
- నమూనాలు
- డిజైన్లపై చర్చలు
- విస్తృత సంప్రదింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Ghat : మూసీ తీరంలోని బాపూఘాట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. బాపూఘాట్లో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. బాపూఘాట్ ను సోదర సౌభ్రాతృత్వానికి సంకేతంగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా అటు అధ్యాత్మికంగా, ఇటు విద్యాబోధన కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్ ను అధునాతనంగా.. అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని తన ఆలోచనలను ఇటీవలే అధికారులతో పంచుకున్నారు. అటు ఉస్మాన్ సాగర్, ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్ గా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్ గా గాంధీ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
Mumbai: సైకిల్‌తో యువకుడు స్టంట్.. చివరికి ఏమైందంటే..! వీడియో వైరల్
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
మూసీ నదీ తీరంలో సుందరమైన విశాల ప్రాంతం కావటంతో.. బాపూఘాట్ లో ఎలాంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. దీన్ని ఏ ఆకృతిలో తయారు చేయాలి.. ఎంత ఎత్తుతో తయారు చేయించాలి.. డిజైన్లు ఎలా ఉండాలి.. అనేది ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి.. ఎక్కడెక్కడ గాంధీ ఆశ్రమాలున్నాయి.. ఏయే నమూనాలో ఉన్నాయి.. వెంటనే అధ్యయనం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్ లో ఎలాంటి విగ్రహం పెట్టాలి… మూసీ నదీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశముంది…. సాధ్యాసాధ్యాలన్నింటినీ ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాల్లో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న గాంధీ విగ్రహమే అత్యంత ఎత్తయింది. దీని ఎత్తు 72 అడుగులు. 2013లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది కాంస్యంతో తయారు చేశారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ అప్యాయంగా ఉన్నట్లుగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రపంచంలో వివిధ దేశాల్లోనూ గాంధీ విగ్రహాలున్నాయి. అమెరికాలోని టెక్సాస్లోని ఇర్వింగ్ లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహముంది. ఇప్పటివరకు భారత దేశం బయట ఉన్న అతి పెద్ద విగ్రహం ఇదే. గాంధీ దండి మార్చ్ కు నడుస్తున్న భంగిమలో ఈ విగ్రహముంటుంది. శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఇది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
2018లో గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో ఐక్యతా చిహ్నంగా సర్దార్ వల్లభబాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా దీన్ని నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే ఎత్తున గాంధీ విగ్రహం నిర్మించాలా..? పాట్నాలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి మించిన ఎత్తులో దీన్ని నిర్మించాలా…? కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న భంగిమలో గాంధీ విగ్రహాన్ని తయారు చేయించాలా… దండి మార్చ్ కు కదులుతున్నట్లుగా నిలబడి ఉండాలా… మరేదైనా నమూనా ఎంచుకోవాలా.. అనే విషయంలో విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలని, అవసరమైతే అన్ని వర్గాల మేధావులు, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను స్వీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ప్రపంచంలో అందరి మదిలో నిలిచేలా బాపూఘాట్లో మహాత్ముడి విగ్రహాం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎదుట ఉన్న మహాత్మగాంధీ విగ్రహమే ఇప్పటివరకు తెలంగాణలో పెద్దది. ధ్యాన ముద్రలో ఉన్న ఈ గాంధీ విగ్రహం ఎత్తు 22 అడుగులు. మైలైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే సందేశంతో కాంస్యంతో దీన్ని తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్నిఆవిష్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బాపూఘాట్ లో ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Jai Hanuman: కన్నడ స్టార్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్‌వర్మ
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!