Site icon NTV Telugu

Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్‌లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!

M Gandhi

M Gandhi

Mahatma Gandhi: ఈ రోజు అక్టోబర్ 2వ. మహాత్మా గాంధీ 156వ జయంతి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15వ తేదీ రాత్రి మన దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. ఇస్లాం పేరుతో మన దేశం విభజించబడింది. పాకిస్థాన్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. విభజనకు మహాత్మా గాంధీ కారణమని చాలామంది నమ్ముతారు. ముస్లింలను సంతృప్తి పరచడానికి జిన్నా డిమాండ్లకు గాంధీ అంగీకరించారని రాడికల్ రైట్-వింగర్లు నమ్ముతారు.

READ MORE: Medha Gandhi: మహాత్మా గాంధీ ముని మనవరాలు పెద్ద యాక్టర్ అని మీకు తెలుసా..?

అయితే.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ స్వయంగా పాకిస్తాన్‌కు వెళ్లాలని అనుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత గాంధీ మన పొరుగు దేశంలో స్థిరపడాలని కోరుకున్నారట. అయితే, ఆయన కోరిక వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ రాసిన “గాంధీస్ హిందూయిజం: ది స్ట్రగుల్ ఎగైనెస్ట్ జిన్నాస్ ఇస్లాం” అనే పుస్తకం ప్రకారం.. మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజును పాకిస్థాన్‌లో గడపాలని కోరుకున్నారని పేర్కొన్నారు. అయితే.. అప్పటి నాయకులు మహాత్మా గాంధీ పాకిస్థాన్ పర్యటన ప్రకటనలను పట్టించుకోలేదట.

READ MORE: MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి

మహాత్మా గాంధీ పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లాలనుకున్నారో తెలుసుకుందాం.. MJ అక్బర్ పుస్తకం ప్రకారం.. స్వాతంత్ర్యం తర్వాత మహాత్మా గాంధీ రెండు దేశాలలోని మైనారిటీల గురించి ఆందోళన చెందారు. పాకిస్థాన్ లో హిందువులు, భారత్‌లో ముస్లింలు మైనార్టీలు. గాంధీ హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని భావించారు. 1946 అల్లర్లలో హిందువులు అత్యంత ప్రభావితమైన తూర్పు పాకిస్థాన్ లోని నోఖాలిలో నివసించాలని గాంధీ కోరుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి గాంధీ అక్కడికి వెళ్లాలని కోరుకున్నారు. 1947 మే 31న, గాంధీ పఠాన్ నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్ (ఫ్రాంటియర్ గాంధీగా ప్రసిద్ధి చెందారు) తో తాను స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ సరిహద్దును సందర్శించి పాకిస్థాన్ లో స్థిరపడాలని కోరుకుంటున్నానని చెప్పారని పుస్తకంలో ఉంది.

Exit mobile version