NTV Telugu Site icon

Parliament: పార్లమెంట్లోని అంబేద్కర్, గాంధీ విగ్రహాల స్థానాల్లో మార్పులు.. కాంగ్రెస్ ఫైర్..!

Parlament

Parlament

Congress: ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దౌర్జన్యపు చర్య అని జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్‌ భవనం ముందు ఉన్న విగ్రహాలను మార్చడం చాలా దారుణమన్నారు.

Read Also: Rahul Gandhi: మోడీ, షా స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు(వీడియో)

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడంతోనే పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ, అంబేద్కర్‌ విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం మార్చిందని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షులు పవన్ ఖేరా ఆరోపించారు. ఇక, గుజరాత్‌లో బీజేపీ అన్ని స్థానాలను గెలవకపోవడంతోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా మరో చోటుకు మార్చారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకవేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే దేశ రాజ్యాంగాన్ని కూడా వాళ్లే మార్చేవారంటూ ప్రశ్నించారు.

Read Also: Babar Azam Record: చ‌రిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్!

ఇక, పార్లమెంట్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగానే విగ్రహాలను మార్చామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ల్యాండ్ స్కేపింగ్ ఆధునీకరణ కోసం పార్లమెంట్ విగ్రహాలను ఒకే చోట ఉంచబోతున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాలను పాత పార్లమెంట్ భవనం, పార్లమెంట్ లైబ్రరీ మధ్య ఉన్న గార్డెన్‌లో ఉంచారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రముఖుల విగ్రహాలన్నీ ఇప్పుడు ఒకే చోటుకు చేరుకున్నాయి. ఇక, కేంద్ర ప్రభుత్వం చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.