Vemulawada: తెలంగాణలోనే అతిపెద్ద ప్రసిద్ద పుణ్యక్షేత్రం మైనా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సుమారు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అధికారులు ప్రత్యేక చేశారు. ఉదయమే రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి జాతర కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా 1500 మంది పోలీసులతో భద్రత పరంగా కేటాయించారు. ఈరోజు టీటీడీ, ప్రభుత్వం తరుపున శ్రీ స్వామి వార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. రాష్ర్ట ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ర్ట రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ స్వామి వార్లకు పట్టువస్త్రాలను రాత్రి 7 గంటలకు సమర్పించనున్నారు.
Read Also: Enumamula Market: వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవు
అలాగే అనాధిగా వస్తున్న అచారం, సంప్రదాయం ప్రకారం ఇవ్వాల రాత్రి 7.30 లకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దంపతులకు తిరుమల తిరుపతి అర్చక బృందం, అధికారులు రాజన్నకి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని రంగు రంగు పూలతో అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు కోడే మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. రేపటి మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక ఆలయ అర్చకులచే మహాలింగార్చన రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం 1000 ప్రత్యేక జాతర బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మహ శివరాత్రి జాతర కోసం ఇవ్వాలని 7న 265 బస్సులను, 8న 400 బస్సులను, 9న 329 బస్సులను నడిపించనున్నారు.
Read Also: Elevated Corridor: ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. ఎలివేటేడ్ కారిడార్‌కు నేడు భూమిపూజ
రాజన్న క్షేత్రంకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వేలాది మంది భక్తులు శ్రీస్వామి వారి దర్శనం కోసం రానున్నారు. ఇప్పటికే మహశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, భద్రత పరంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణ ప్రపాద్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు.