Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర జల్గావ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించాల్సిన ఊరేగింపు మార్గంపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. యావల్ తాలూకాలోని కింగాన్గావ్లో ఒక ప్రార్థనా స్థలం ముందు నుంచి ఊరేగింపు వెళ్లడాన్ని కొందరు మహిళలు వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరిగి ఇరు వర్గాల రాళ్లదాడి జరిగినట్లు తెలుస్తోంది.
దసరా వేడుకల్లో భాగంగా కింగాన్గావ్లో ఆర్ఎస్ఎస్ ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ఊరేగింపు వెళ్లాల్సిన మార్గంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పుణ్యక్షేత్రం ముందు నుంచి వెళ్లడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేశారు, రెండు గంటల పాటు చర్చలు జరిపినా నిరసన కొనసాగినట్లు జల్గావ్ ఎస్పీ శ్రీకాంత్ దివారే తెలిపారు.
Also Read
- Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
- Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
- Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
నిరసన కొనసాగుతున్న సమయంలో రాళ్లదాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేుశారు. దీని తర్వాత ఆర్ఎస్ఎస్ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వెల్లడించారు. కింగాన్గావ్లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతగానే ఉందని, తగినన్ని బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..