Maharashtra Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 dead in Maharashtra Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హ్యాండ్ గ్లవ్స్ తయారీ కంపెనీలో చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఔరంగాబాద్ సమీపంలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కస్టపడి.. ఆదివారం ఉదయం వరకు మంటలు అదుపులోకి తెచ్చారు.
వివరాల ప్రకారం… ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో వలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని హ్యాండ్ గ్లవ్స్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకునే కాసేపటికే కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 10-15 మంది నిద్రిస్తున్నారు. అప్రమత్తమైన కొందరు తప్పించుకోగా.. ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఉదయం వరకు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!